కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు వాళ్ల సొంత భూముల్లో కూలీలుగా పని చేసే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.
రైతులను మోసం చేసే విధానాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడం వల్ల స్థానిక పోలీసులు నేతలను బలవంతంగా స్టేషన్కు తరలించారు.