ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలతో రైతులకు భరోసా లేదు: కాలవ శ్రీనివాసులు - కాలవ శ్రీనివాసులు కామెంట్స్

నూతన వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురంలో వామపక్ష పార్టీ నేతలు నల్లచట్టాలపై సదస్సు నిర్వహించగా దానికి తెదేపా నాయకుడు కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. రైతుల సందేహాలకు సమాధానాలు చెప్పటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ చట్టాలతో ఎలాంటి భరోసా లేదని ఆరోపించారు.

left parties Conference
చట్టాలపై నిరసనలు

By

Published : Jan 16, 2021, 6:07 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెదేపా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు చెప్పారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీ నేతలు నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ చట్టాలతో ఎలాంటి భరోసా లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ వ్యవస్థను అన్నదాతకు దూరం చేస్తున్నారని తెలిపారు. రైతుల సందేహాలకు సమాధానాలు చెప్పటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. 26న దేశవ్యాప్తంగా రైతులతో కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అనంతపురం జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details