రాయలసీమ ప్రాంతానికి వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో కృష్ణ నది బోర్డు, విశాఖకు తరలింపు అంశాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
'కృష్ణానది బోర్డును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి' - అనంతపురం తాజా వార్తలు
కృష్ణా నది బోర్డును విశాఖకు తరలింపు అంశాన్ని ఖండిస్తూ అనంతపురంలో వామపక్ష పార్టీలు సమావేశాన్ని నిర్వహించాయి. కృష్ణా జలాలతో ప్రస్తుతం రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని.. వీటి పరిధిలోని బోర్డును ఏర్పాటు చేస్తేనే జలవివాదాలు పరిష్కారమవుతాయని పలువురు తెలిపారు.
వామపక్ష పార్టీల నాయకులు
కృష్ణా జలాలతో ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయని అన్నారు. వీటి పరిధిలోనే బోర్డును ఏర్పాటు చేస్తే జలవివాదాల సమస్య పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ అభివృద్ధికి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. బోర్డును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని త్వరలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్నికలు లేకపోయినా కోడ్.. నాయకుల విగ్రహాలకు ముసుగులు