ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అతిథి అధ్యాపకులకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారి జీవనం దయనీయంగా మారింది. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలానికి చెందిన చంద్రశేఖర్ లేపాక్షిలోని మహాత్మా జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. మూడు నెలలుగా ఆయనకు జీతం రాలేదు. కుటుంబ పోషణకు తన స్వగ్రామం మల్లసముద్రంలో ఉపాధి పనులకు వెళ్తున్నారు. కళాశాలలో అధ్యాపకుడిగానే కాకుండా అదనపు పనులు చేశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోవడంతో తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఉపాధి పనులకు వెళ్తున్నానని తెలిపారు. 20 రోజుల నుంచి పనులకు వెళ్తున్నానని, రోజు రూ.200 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని చెప్తున్నారు.
జీతం లేక.. కూలి పనులు చేస్తున్న అధ్యాపకుడు
కరోనా అందరి జీవితాలను కలవరపెడుతోంది. కొవిడ్ వ్యాప్తితో విద్యాసంస్థలు తెరచుకోలేదు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో కుటుంబపోషణ భారమైంది. కడుపు నింపుకోవడం కోసం వీరు కూలి పనులకు వెళ్తున్నారు.
lecturer going to daily wage