అనంతపురం జిల్లా కల్యాణదుర్గం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం గ్రామస్థులను భయాందోళనలకు గురిచేస్తోంది. కుందుర్పి మండలం బోధపల్లి గ్రామంలో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ సంఘటనలో పలు మేకలకు గాయాలు కాగా... ఒక మేకను చిరుత తినేసింది. కాపలాగా ఉన్న యజమాని ఓబులేశు అక్కడి నుంచి పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి వెళ్లి యజమానికి నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.
కల్యాణదుర్గంలో చిరుత సంచారం... - కల్యాణదుర్గంలో చిరుత సంచారం తాజా వార్తలు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుత సంచారం భయాందోళనలు సృష్టిస్తోంది. అటవీ అధికారులు చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.

కల్యాణదుర్గంలో చిరుత సంచారం