ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Leapord Wandering: పంట పొలాల్లో చిరుత సంచారం.. - చిరుతపులి సంచారం తాజా వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో కలకలం రేపుతోంది. అమరాపురం మండలం చిట్నడుకు గ్రామం శివారులోని పంట పొలాల్లో చిరుత సంచరిస్తుండగా.. కొందరు రైతులు దాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. కాసేపటికి చిరుత అక్కడి నుంచి వెళ్లిపోగా.. రాత్రి సమయాల్లో చిరుత వచ్చి తమపై దాడి చేసే అవకాశమున్నట్లు రైతులు తెలిపారు.

Leapord Wandering in agriculture fields at madakashira in ananthapur
పంట పొలాల్లో చిరుత పులి సంచారం.. రైతుల్లో నెలకొన్న భయం

By

Published : Oct 3, 2021, 1:31 PM IST

పంట పొలాల్లో చిరుత పులి సంచారం.. రైతుల్లో నెలకొన్న భయం

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో చిరుత పులి సంచలనం కలకలం రేపింది. అమరాపురం మండలం చిట్నడుకు గ్రామం శివారులోని పంట పొలాల్లో చిరుత సంచరించింది. ఏకాంత అనే రైతు పూల తోటలో.. చిరుత తిష్ట వేసింది. దాన్ని చూసిన చుట్టుపక్కల రైతులు భయాందోళనలకు గురయ్యారు చెందారు. కుక్కలు దాన్ని చూసి మొరగడంతో కొద్దిసేపటి తర్వాత చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. రాత్రి సమయాల్లో.. పొలాల్లో పంటలకు నీరు అందించే సమయంలో చిరుత నుంచి ప్రాణహాని కలగవచ్చని రైతులు అన్నారు. వన్యప్రాణుల దాడి నుంచి అధికారులు తగు చర్యలు తీసుకొని రైతులను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details