..
హనుమంత వాహనంపై ఊరేగిన కదిరి లక్ష్మీ నరసింహుడు
అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్వామి వారు హనుమంత వాహనంపై వీధుల్లో విహరించారు. శ్రీ ఖాద్రి వసంత వల్లభరాయుడిని ధర్మ నరసింహుడిగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనుడిని చేశారు. అలంకార మండపం నుంచి ప్రత్యేక పద్ధతిలో రాజగోపురం ముందుకు స్వామి వారిని తీసుకొచ్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తిరువీధుల ఉత్సవం మొదలైంది. స్వామివారి ఊరేగింపు ముందు భజన మండలి సభ్యులు, కోలాటం బృందం నరసింహ స్వామి నామస్మరణతో ముందుగా నడిచారు. తిరువీధుల్లో అడుగడుగున భక్తులు స్వామికి ఫల పుష్పాలను సమర్పించి దర్శన భాగ్యం పొందారు.
హనుమంత వాహనంపై ఊరేగిన కదిరి లక్ష్మీ నరసింహుడు