అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి అంజనేయ స్వామి దేవాలయంలో లంకా దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిపారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. అంజనేయ స్వామి విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి.. పల్లకిలో శివాలయం వద్దకు ఉరేగింపుతో తీసుకెళ్లారు. అక్కడ బాణసంచా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
నెట్టికంటి అంజనేయ స్వామి ఆలయంలో లంకా దహనం.. - Nettikanti Anjaneya Swamy Temple latest news
అనంతపురం జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి అంజనేయ స్వామి దేవాలయంలో లంకా దహనం నిర్వహించారు. విగ్రహలను పల్లకిలో తీసుకెళ్లి బాణసంచా పేల్చారు.
ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో అశేష భక్త జనం నడుమ ఊరేగించారు. బాణసంచా వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా దేవాదాయ, పోలీసు శాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగాది ఉత్సవాల్లో మూడోరోజు లంకా దహన కార్యక్రమాన్ని నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారమని ఆలయ పండితులు తెలిపారు. రెండవ దశ కొవిడ్ వ్యాప్తి ప్రబలుతున్న వేళ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖులు