ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చరియలు - ఆలూరుకొనలో విరిగిపడ్డ కొండ చరియలు

తాడిపత్రి మండలం ఆలూరుకొన రంగనాథ స్వామి ఆలయ సమీపంలో కొండ చరియలు విరిగి రహదారికి అడ్డుగా పడిపోయాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

landslides broken by heavy rain in thadipathri ananthapur district
భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చరియలు

By

Published : Oct 2, 2020, 5:04 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరుకొన రంగనాథ స్వామి ఆలయ సమీపంలో కొండ చరియలు విరిగి రహదారికి అడ్డుగా పడిపోయాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండపై నుంచి వర్షం నీటితో సహా చిన్నపాటి బండరాళ్లు కింద పడుతున్నాయి. తాజాగా మూడు పెద్ద బండరాళ్లు కొండపై నుంచి జారుతూ వచ్చి రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో దేవాదాయ శాఖ సిబ్బంది బండరాళ్లను పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. ఒక బండరాయి చాలా పెద్దగా ఉండటంతో ఆ రాయిని పక్కకు జరపలేక వాహనాలు వెళ్ళేందుకు వీలుగా రహదారిని విస్తరించారు.

ఇదీ చదవండి:

'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details