ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులతో వసతులు కల్పిస్తున్నామని సిద్ధారెడ్డి అన్నారు. తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి ఎనభై ఏడు లక్షలతో 30 పడకల అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. నూతన భవనాలను త్వరగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తేవాలని గుత్తేదారుడికి ఎమ్మెల్యే సూచించారు.
తనకల్లు వైద్యశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ - అనంతపురం జిల్లా తనకల్లు ప్రభుత్వాసుపత్రి వార్తలు
ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే తనకల్లు వైద్యశాలలో కోటి 87 లక్షల రూపాయలతో 30 పడకల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ