అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. 80 రోజులకు 10 లక్షల 35 వేల 990 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో సాకే రమేష్ బాబు పేర్కొన్నారు. గతంలో రూ.8 లక్షల 86 వేల 400 రాగా.. ఈసారి రూ. 1.లక్ష 49 వేల 590 రూపాయల మేర ఆదాయం పెరిగిందన్నారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామతులసి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు.
లక్ష్మీ నరసింహుడి హుండీ లెక్కింపు - శ్రీలక్ష్మీ నరసింహ స్వామి హుండీ వార్తలు
అనంతపురం జిల్లా పెన్నహోబిలంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 80 రోజులకు రూ.10.35 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
లక్ష్మీ నరసింహుడి హుండీ లెక్కింపు