అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల బుగ్గ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో గణపతి పూజ, పుణ్యాహవచనము, ప్రధాన కలశ స్థాపన, వాస్తు నవగ్రహ మంటపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంత ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి ఎమ్మెల్యే కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు.
వైభవంగా ఎల్లుట్ల లక్ష్మీనారాయణ స్వామి కల్యాణోత్సవం - ఎల్లుట్ల లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం వార్తలు
అనంతపురం జిల్లా ఎల్లుట్ల బుగ్గ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు.
వైభవంగా ఎల్లుట్ల లక్ష్మీనారాయణ స్వామి కల్యాణోత్సవం