కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ఘనంగా ప్రారంభమైంది. లక్ష్మీ సమేత నరసింహుని ఉత్సవమూర్తులు.. బ్రహ్మరథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం రథం వద్ద అర్చక స్వాములు కలశ స్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రథంపై అధిష్టించిన దేవదేవుడికి మహాబలిహారం, మంగళ హారతి నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి. నరసింహ, గోవిందా అంటూ భక్తుల స్వామివారిని స్మరిస్తూ.. రథాన్ని లాగారు.
కదిరిలో వైభవంగా ప్రారంభమైన లక్ష్మీ నరసింహుని రథోత్సవం - కదిరి తాాజా వార్తలు
అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ప్రత్యేక పూజల అనంతరం గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగటం ప్రారంభించారు.
కదిరి లక్ష్మీ నరసింహుని రథోత్సవం