కార్తికమాసం సందర్భంగా స్థానిక సాయిబాబా దేవస్థానంలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు భక్తులు సతిసమేతంగా కార్తికమాస వ్రతాన్ని ఆచరించి, లక్ష దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఏకపాదంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు ఆలయం ఆవరణలో పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు.
కార్తికమాసం: ఘనంగా లక్ష దీపోత్సవం - Karthika depostavam in Andhra Pradesh
కార్తికమాసం సందర్భంగా విజయవాడలోని సాయిబాబా ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కార్తిక మాసం: ఘనంగా లక్ష దీపోత్సవం