ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీనియర్ అసిస్టెంట్ వేధిస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - Vuravakonda ICDS Latest News

ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్​లో సూపర్​ వైజర్లుగా విధులు నిర్వహిస్తున్న నలుగురు మహిళలు... అదే ప్రాజెక్టులో పనిచేస్తున్న టైపిస్టు, సీనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. తమను మానసికంగా వేధిస్తున్నారంటూ పీడీ విజయలక్ష్మికి పిర్యాదు చేశారు.

ఉరవకొండ ఐసీడీఎస్
ఉరవకొండ ఐసీడీఎస్

By

Published : Apr 1, 2021, 7:54 PM IST

బాధితులు

అనంతపురం జిల్లా ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అవినీతి అధికారులు తమను ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ... నలుగురు మహిళా సూపర్​ వైజర్​లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి... ముగ్గురు సభ్యుల బృందాన్ని ఉరవకొండ కార్యాలయంలో విచారణకు పంపారు. ఏపీడీ లక్ష్మీకుమారి అధ్వర్యంలో బాధితులను కలిసి నేరుగా విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... ఐఎల్​ఏ బిల్లు చేయమంటే కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్, సీనియర్ అసిస్టెంట్ హుసేన్ బాషా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అటెండెన్స్ సర్టిఫికెట్ కోసం వెళ్తే పేపర్లను ముఖానికి విసిరికొడుతున్నారని ఆరోపించారు. తమపై అక్రమ కేసులు పెడతామని భయపెడుతున్నారని వాపోయారు. కొంతమంది అంగన్వాడీల భర్తలకు మద్యం తాగించి తమపై నిఘా ఉంచుతున్నారని చెప్పారు. తమకు రక్షణ లేకుండా పోయిందని... ఇలా అయితే పని చేయలేమని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details