అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సౌభాగ్య థియేటర్ వెనక వడ్డే బండ వీధిలో నివసిస్తున్న ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పది నెలల క్రితమే కర్నూలుకు చెందిన యువకుడు మనోజ్కుమార్తో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి వీరిమధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో ఆమె తన తాతయ్య ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆదివారం ఉదయం ఆమె తాత బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తీయలేదు. తలుపులు పగలగొట్టి చూస్తే ఆమె ఉరి వేసుకుంది. వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కళ్యాణదుర్గం ఎస్ఐ దామోదర్ కేసు నమోదు చేశారు.
కళ్యాణదుర్గంలో వివాహిత ఆత్మహత్య - ananthapuram district latest news
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వడ్డే బండ వీధిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు మధ్య మనస్పర్థలు ఉన్నందున కొద్ది రోజుల నుంచి ఆమె తాతయ్య ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బండ వీధిలో వివాహిత ఆత్మహత్య