అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలపురం గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. మౌనిక అనే బీటెక్ అమ్మాయి (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా మౌనిక కడుపు నొప్పితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ మాటతో కుటుంబం ఒక్కసారిగా బాధతో కుప్పకూలింది.
కడుపు నొప్పి తాళలేక బీటెక్ యువతి ఆత్మహత్య - lady suicide in ananthapuram district
అనంతపురం జిల్లా మాలపురం గ్రామంలో బీటెక్ చదువుతున్న మౌనిక అనే మహిళ సోమవారం ఉరి వేసుకుంది.
![కడుపు నొప్పి తాళలేక బీటెక్ యువతి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4607353-512-4607353-1569866586623.jpg)
కడుపు నొప్పి తాళలేక బీటెక్ యువతి ఆత్మహత్య