అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో.. శోభారాణిని అనే మహిళ బేకరీ నిర్వహస్తోంది. ఆమె భర్త నరసింహులు ఉపాధి నిమిత్తం కర్ణాటకలో ఉంటున్నారు. దీంతో.. శోభారాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి కొక్కంటిక్రాస్లో నివసిస్తోంది. అయితే.. ఆదివారం శోభారాణి భర్త నరసింహులు కర్ణాటక నుంచి వచ్చారు. బేకరీలో ఉన్న సమయంలో.. నరసింహులు తన భార్య ఫోన్ తీసుకున్నాడు.
ఇది గమనించిన శోభారాణి వెంటనే అక్కడి నుంచి హడావిడిగా ఇంటికెళ్లి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దుకాణంలోనే ఉన్న నరసింహులు కొద్ది సేపటి తర్వాత ఇంటికెళ్లాడు. అప్పటికే ఉరివేసుకుని వేళాడుతున్న భార్యను చూసి నిశ్చేష్టుడైపోయాడు. పరుగున వెళ్లి, కిందకు దింపాడు. కొనఊపిరితో ఉన్న భార్యను.. చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. కానీ.. ఆసుపత్రికి చేరిలోపే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.