ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో తాగునీటి కోసం మహిళల ధర్నా - అనంతపురం జిల్లా

తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నెల రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా  రొద్దం మండలం మరువపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది.

మహిళల ధర్మా తాగునీటికోసం

By

Published : Sep 28, 2019, 12:54 PM IST

తాగునీటి కోసం అనంతపురంలో మహిళల ధర్నా

అనంతపురం జిల్లాను తాగునీటి సమస్య నానాటికి వెంటాడుతూనే ఉంది. సాగునీటికే కాదు...కనీసం తాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నారు ఆ ప్రాంత ప్రజలు. తాజాగా జిల్లాలోని మరువపల్లి కాలనీలో నెలరోజులుగా తాగుటానికి చుక్కనీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అరకొరగా ట్యాంకర్లతో సరఫరా చేయడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెనుకొండ-పావగడ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details