అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆక్సీజన్ పడకలు లేక కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారు. గుంతకల్లుకు చెందిన నర్సు కుటుంబానికి కరోనా సోకింది. నర్సు సహా ఆమె భర్త, కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఏ ఆసుపత్రికి ఫోన్ చేసినా ఆక్సిజన్ పడకలు లేవనే సమాధానమే వారికి ఎదురైంది.
పడకల్లేక అవస్థలు.. అంబులెన్స్‌లో నర్సుకు ఆక్సిజన్ - గుంతకల్లులో కరోనా
అనంతపురం జిల్లా గుంతకల్లులో నర్సు కుటుంబానికి కరోనా సోకింది. ఆస్పత్రిలో ఆక్సీజన్ పడకలు లేక కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిక్కులేక భర్త ప్రైవేట్ అంబులెన్స్‌లో భార్యకు ఆక్సీజన్ పెట్టించారు.
మూడు గంటల వ్యవధికి 7వేలు రూపాయలు చెల్లించేలా ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ను వారు మాట్లాడుకున్నారు . అందులో నర్సుకు ఆక్సిజన్ పెట్టించారు. ఎస్కే విశ్వవిద్యాలయం ఎదుటే రోడ్డు మీదే అంబులెన్స్‌లో నర్సు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. కొద్దిసేపటి తర్వాత భర్త మళ్లీ అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుకు చికిత్స కొనసాగుతోంది. ఆమెకు ఏమవుతుందో అని భర్త, కుమారుడు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు