వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి - crime news ananthapuram
బెళుగుప్ప మండలంలోని గంగవరం గ్రామనికి చెందిన ఏరిస్వామి(56) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. మృతదేహన్ని ఉపాధి కూలీలు స్వగ్రామానికి తీసుకెళ్లారు.

మృతి చెందిన ఏరిస్వామి
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన ఏరిస్వామి(56) ఉదయం ఉపాధి హామీ పనికోసం గ్రామ శివారుల్లో కూలీ పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో తరలించగా వడదెబ్బ తగిలి అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతదేహన్ని తోటి ఉపాధి కూలీలు స్వగ్రామానికి తీసుకెళ్లారు.