ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ సభ్యులపై దాడి ... భార్య, ఇద్దరు కుమారులకు గాయాలు.. - KUTUMBA_SABHYULA_PAI_KATTI_THO_DADHI_

రోజు రోజుకీ మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. కుటుంబ తగాదాలతో తన భార్య, ఇద్దరు కుమారులను కత్తితో పొడిచాడు ఓ తండ్రి. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన వైద్యంకోసం స్థానికులు 108లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామంలో జరిగింది.

KUTUMBA_SABHYULA_PAI_KATTI_THO_DADHI_
కుటుంబ సభ్యులపై దాడి

By

Published : Aug 16, 2021, 4:02 PM IST

మద్యం మత్తులో కుటుంబ తగాదాలను మనసులో పెట్టుకుని తన భార్య, ఇద్దరు కుమారులను కత్తితో పొడిచి గాయపరిచాడు ఓ తండ్రి. ఈ ఘటన ఒంగోలు జిల్లాలోని దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామంలో జరిగింది. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు 108లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎర్రబాలెం గ్రామానికి చెందిన ముచ్చు నాసరయ్య(47)కు భార్య కోటమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన నాసరయ్య.. మద్యం మత్తులో తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు.

ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన నాసరయ్య భోజనం చేస్తున్న పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు(25 )ను ఇంటినుండి బయటికి వెళ్ళు అంటూ కోడి కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన తన రెండవ కుమారుడు బాల వెంకటేశ్వర్లు(17 )ను తనని కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని కోటమ్మ తెలిపింది.

భయపడిన మూడవ కుమారుడు వెంకట గురవయ్య భయంతో పరుగులు తీసాడు అని తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానికులు 108 కు కాల్ చేసి మెరుగైన వైద్యం కోసం దర్శి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కాంగ్రెస్​ పార్టీకి మరో కీలక నేత గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details