అనంతపురంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు అనుమతిని నిరాకరించారు. మొదట రూ.1000 రుసుముతో భక్తులకు దర్శనం భాగ్యం కలిగించాలని అనుకున్న ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో సామాజిక దూరం పాటించడానికి వీలు లేక.. ఈ దర్శనానికి కూడా నిరాకరించారు.
ఇవాళ కొంత మంది భక్తులు, చిన్నపిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో ఆలయం వద్దకు వచ్చి సెల్ఫీలు దిగారు. వేషధారణలో ఉన్న చిన్నారులు సందడి చేశారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కేవలం ఆలయ కమిటీ జీవితకాలపు సభ్యులకు మాత్రమే దర్శన అనుమతి ఉన్నట్లు తెలిపారు.