అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్దనున్న ఎనిమిదవ లిప్టునకు కృష్ణ జలాలు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు.. నాలుగు పంపుల ద్వారా 1129 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవా కాలువలోకి పంపింగ్ చేస్తున్నారు. ఉరవకొండ మీదుగా జలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుకోనున్నాయి. కాలువకు నీరు విడుదల కావటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల రాకతో జిల్లాలో తాగునీటి ఎద్దడి దాదాపుగా తీరిపోనుందని అధికారులు తెలిపారు.
కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు..రైతు మోములో సంతోషం - ananta
కరవు నేలలో కృష్ణమ్మ పరుగులెడుతోంది. వర్షపు చుక్కలేక దిగాలుగా కూర్చున్న రైతన్న మోములో ఆనందాన్ని నింపి..అనంతనేలలో కృష్ణ జలాలు పరవళ్లు తొక్కతున్నాయి.
కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు