అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు చేరుతున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం 1.913 టీఎంసీలు..200క్యూసెక్లు కృష్ణా జలాలు గొల్లపల్లి జలాశయానికి చేరుతున్నాయి. అధికారులు మూడు పంపులతో నీళ్లు విడుదల చేశారు. మార్గమధ్యలో కనుమ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ముష్టి కోవెల చెరువుకు రెండు చిన్న పంపులు ద్వారా నీళ్లు వెళుతున్నాయి. నెలరోజుల పాటు ఇదే విధంగా జలాశయానికి నీళ్లు విడుదల చేస్తే నిండతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గొల్లపల్లి జలాశయానికి చేరుతున్న కృష్ణా జలాలు - అనంతపూరం జిల్లా
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. ఇదే విధంగా నెలరోజుల పాటు నీళ్లు విడుదల చేస్తే నిండుతుందని రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గొల్లపల్లి జలాశయానికి చేరుతున్న కృష్ణా జలాలు
Last Updated : Sep 4, 2019, 12:11 PM IST