రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. వెలిగొండ, తెలుగుగంగ విస్తరణ పనుల డీపీఆర్‌లు ఇవ్వాలని కోరింది. తెలంగాణ ఫిర్యాదు మేరకు ఏపీ ఈఎన్‌సీకి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. సంబంధిత వివరాలను అందజేయాలని బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే కోరారు.
KRMB: రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ - ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ
19:54 September 07
krmb letter to ap govt
విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఆపేలా చూడాలని కేఆర్ఎంబీని కోరింది. తెలంగాణ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని.. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ చేసిన ఫిర్యాదు లేఖను కూడా లేఖతో పాటు జతపరిచి ఏపీకి పంపించింది.
ఇదీ చదవండి
CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్