ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత జిల్లాలో కొరియన్ విద్యార్థులు...ఏం చేశారంటే..!

అనంతపురం జిల్లా కియా పరిశ్రమ ఆధ్వర్యంలో కొరియన్ విద్యార్థులు 'హ్యాపీ మూవ్' కార్యక్రమం చేపట్టారు. స్థానిక విద్యార్థులతో కలిసి... జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు ఆదర్శ పాఠశాల పునరుద్ధరణ పనులు చేశారు.

korean student at anatapur school on social service activity
అనంత పాఠశాలలో కొరియన్ విద్యార్థులు

By

Published : Jan 8, 2020, 10:47 PM IST

అనంత పాఠశాలలో కొరియన్ విద్యార్థులు
అనంతపురం జిల్లా కియా కార్ల తయారీ పరిశ్రమ... సీఎస్​ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాసిబిలిటీ)లో భాగంగా 80 మంది కొరియన్ విద్యార్థులు 'హ్యాపీ మూవ్' కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గుట్టూరు ఆదర్శ పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పాఠశాలలోని మరుగుదొడ్లను బాగుచేయించారు. విద్యార్థులు ఆడుకునేందుకు పలు రకాల పరికరాలు, పాఠశాల ప్రహరీకి మరమ్మత్తులు చేశారు. పాఠశాలలోని పలు భవనాలకు రంగులు వేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు మెరుగులు

విద్యార్థులతో చిత్రలేఖనం సాధన చేయించారు కొరియన్ విద్యార్థులు. పది రోజుల పాటు పెనుకొండ మండలంలోని గుట్టూరు, కురుబవాండ్లపల్లి గ్రామాల్లో పాఠశాలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని 'హ్యాపీ మూవ్' వాలంటీర్లు తెలిపారు. పాఠశాలలో మరమ్మత్తు పనులు జరగడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details