అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలో నీటి సమస్యను తీర్చాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆరు నెలల నుంచి గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
నీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళల నిరసన - నీటి కోసం కోడూరులో ఆందోళన
నీటి కొరత సమస్యను పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా కోడూరులో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. గ్రామ సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

నీటి సమస్య పరిష్కరించాలని నిరసన
'స్నానాలు చేయమంటారు. చేతులు శుభ్రంగా కడుక్కోమంటున్నారు. సబ్బులున్నాయ్ సారూ.. నీరు లేదు. నీళ్లు లేకుండా పరిశుభ్రంగా ఎలా ఉండాలి? తరచూ చేతులు ఎలా కడుక్కోవాలి?' - లక్ష్మీదేవమ్మ, గ్రామస్థురాలు..
ఇదీ చదవండి:సీఎం జగన్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ...ఎందుకంటే ?