ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యాన ఉత్పత్తులతో నాలుగో విడత దిల్లీకి కిసాన్​ రైల్​ - అనంతపురం వార్తలు

దిల్లీ మార్కెట్​కు అనంతపురం నుంచి నాలుగో విడత కిసాన్ రైల్ ఉద్యాన ఉత్పత్తులతో అర్ధరాత్రి బయలుదేరనుంది. ఇందులో 23 మంది రైతులతో పాటు నలుగురు వ్యాపారులు వెళుతున్నట్టు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

kissan rail to delhi from anantapoor tonight
ఉద్యాన ఉత్పత్తులతో నాలుగో విడత దిల్లీకి కిసాన్​ రైల్

By

Published : Jan 20, 2021, 8:47 PM IST

అనంతపురం నుంచి నాలుగో విడత కిసాన్ రైల్ దిల్లీ మార్కెట్​కు వెళుతుంది. ఇవాళ అర్ధరాత్రి బయలుదేరే ఈ రైలులో సాయంత్రం నుంచే పండ్లు లోడ్ చేస్తున్నారు. ఈసారి 23 మంది రైతులతో పాటు, నలుగురు వ్యాపారులు పది బోగీల్లో 240 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దిల్లీ అజాద్​పుర మార్కెట్​కు పంపుతున్నారు.

అనంతపురం జిల్లాలో వ్యాపారులు అరటి టన్ను ధర రూ. 11 వేలు మాత్రమే ఉండగా.. దిల్లీ మార్కెట్​లో 30 నుంచి 40 వేలు పలుకుతోంది. టమోటా, నిమ్మ, కర్బూజ పంటలను ఈసారి కిసాన్ రైలులో పంపుతుండగా.. కేవలం అరటి మాత్రమే 226 టన్నులు పంపుతున్నారు. ఉత్పత్తులను పంపటానికి వారం రోజులుగా ఉద్యానశాఖ అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని.. రైతులు, వ్యాపారులను సమీకరించారు. ఈ రైలు 36 గంటల్లో దిల్లీ మార్కెట్​కు చేరుతుందని కిసాన్ రైల్ నోడల్ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details