కళ్యాణదుర్గం ప్రాంతంలో పలు పంట పొలాలను జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పర్యటించారు. జిల్లాలో ప్రధాన వర్షాధార పంట అయిన వేరుశనగ... అధిక వర్షాలకు తీవ్రంగా దెబ్బతిందని రైతులు వాపోయారు. అతివృష్టి కారణాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు శశి భూషణ్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.
రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి: కిసాన్ మోర్చా
రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటూ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో పర్యటించి రైతుల పెట్టుబడుల గురించి ఆరా తీశారు.
రైతులను కలిసిన కిసాన్ మోర్చా నాయకులు