అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ధనుంజయ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పట్టణంలోని కొల్లాపూరమ్మ గుడి సమీపంలో బాధితుడిపై గుర్తు తెలియని దుండగులు కొడవళ్లతో దాడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో అనంతపురానికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిపై కొడవళ్లతో దాడి... పరిస్థితి విషమం - kalyanadurgam hospital
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కళ్యాణదుర్గంలో వ్యక్తిపై కొడవళ్లతో దాడి... పరిస్థితి విషమం