ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలోనే విద్యుత్ బస్సులు:బుగ్గన - electric busses

అనంతపురం జిల్లా పెనుకొండలో తయారైన కియా మోటార్స్ తొలి నూతన కారు మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈనెల 22 నుంచి కియా కార్లను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్​తో నడిచే బస్సులను తయారు చేసే పరిశ్రమలను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.

విద్యుత్ బస్సులూ తయారయ్యేలా ప్రణాళికలు

By

Published : Aug 9, 2019, 6:07 AM IST

Updated : Aug 9, 2019, 6:15 AM IST

కరవు జిల్లా అనంతపురం పెనుకొండలో తయారైన కియా మోటార్స్ తొలి కారును... రాష్ట్ర మంత్రులు మార్కెట్ లోకి విడుదల చేశారు. సెల్టోస్ కారు కోసం మొదటి రోజే 6000 బుకింగ్ లు రావటం అభినందనీయమన్నారు
పర్యవరణ పరిరక్షణే ధ్యేయంగా....
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యుత్ తో నడిచే ఆర్టీసీ బస్సులు మన రాష్ట్రంలోనే తయారయ్యే విధంగా పరిశ్రమల్ని తీసుకురానున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులకు ఒక అథారిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి వచ్చే వారిని స్వాగతిస్తామన్నారు.

విద్యుత్ బస్సులూ తయారయ్యేలా ప్రణాళికలు
ఇవీ చూడండి-కియా కారు విడుదలపై చంద్రబాబు హర్షం
Last Updated : Aug 9, 2019, 6:15 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details