అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా కార్ల తయారీ పరిశ్రమపై కరోనా ప్రభావం పడింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ చేస్తున్నట్లు పరిశ్రమ పీఆర్వో శ్యామ్ తెలిపారు. పరిశ్రమ నిర్వహణ కోసం అవసరమైన సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారని వెల్లడించారు. 31 వరకు కార్ల ఉత్పత్తి నిలిపివేస్తున్నామని వివరించారు. కియా పరిశ్రమతో పాటు 13 అనుబంధ పరిశ్రమలు సైతం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
31 వరకు కియా పరిశ్రమ మూసివేత
అనంతపురంలోని కియా పరిశ్రమపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. మహమ్మారి వైరస్‌పై పోరులో భాగంగా 31వరకు పరిశ్రమను మూసివేస్తున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. ఉత్పత్తి సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించాయి.
kia industry