కియాలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం రాయదుర్గం మటన్ మార్కెట్ సమీపంలో ఉంటున్న ఈ యువకుడు.. 4 రోజుల క్రితమే పెనుగొండలోని కియా కంపెనీ నుంచి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు... యువకుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్, హైపోక్లోరైడ్ స్ప్రే చేశారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించి, వారని క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాయదుర్గం యువకుడికి కరోనా పాజిటివ్... అధికారులు అప్రమత్తం - రాయదుర్గంలో కరోనా పాజిటివ్
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ యువకుడికి కోరనా పాజిటివ్‌గా నిర్థరణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ యువకుడిని ప్రత్యేక అంబులెన్సులో అనంతపురం అస్కేయూ క్వారంటైన్‌కు తరలించారు.
కియా ఉద్యోగికి కరోనా నిర్థరణ