ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగేశ్వర చెన్నకేశవ ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం - karthika pournami news

అనంతపురం జిల్లా భోగేశ్వర చెన్నకేశవ ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం జరిగింది. పురాతన ఆలయం కార్తిక దీపకాంతులతో శోభిల్లింది. పార్వతీ, భూదేవీ సహిత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

karthika pournami
karthika pournami

By

Published : Dec 1, 2020, 10:39 AM IST

అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఉన్న భోగేశ్వర-చెన్నకేశవ ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తిక దీపకాంతులతో పురాతన ఆలయం శోభిల్లింది. ఆలయంలో కొలువైన పార్వతి, భూదేవి సహిత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు.. మహా మంగళ హారతలు నిర్వహించారు. పెద్దఎత్తున వచ్చిన భక్తులు.. ఉత్సవ మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details