కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్నిఅనంతపురం జిల్లా తలుపుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని ఒదులపల్లి వద్ద కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారును పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో 35 కర్ణాటక లిక్కర్ టెట్రా ప్యాకెట్లను గుర్తించారు. మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రఫీ తెలిపారు. మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత - latest raids on liquor vehicles
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా తలుపుల పోలీసులు పట్టుకున్నారు. సరకు స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేసినట్లు ఎస్సై రఫీ తెలిపారు.
karnatka liquor seized in anantapur dst one arrested