కర్ణాటక మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ముగ్గురిని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కదిరి పట్టణానికి చెందిన అలీ, నిజాముద్దీన్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు ఫుల్ బాటిళ్లు, 55 విస్కీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బోలెరో వాహనం సీజ్ చేశారు.
కర్ణాటక మద్యం స్వాధీనం...ముగ్గురు అరెస్టు - కర్ణాటక మద్యం స్వాధీనం...ముగ్గురు అరెస్టు !
అనంతపురం జిల్లా తనకల్లు పోలీసు స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
మరో ఘటనలో మండల పరిధిలోని బీమ్లా నాయక్ తాండాకు చెందిన మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 24 పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.