అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలంలోని కల్యం, రాయదుర్గం మండలంలోని పల్లెపల్లి గ్రామాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 3,840 మద్యం ప్యాకెట్లు, ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వాహనాలు అధికార వైకాపా నాయకులకు చెందినవిగా పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత - అనంతపురం జిల్లా వార్తలు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటం వల్ల అక్రమార్కులు నూతన విధానానికి తెర లేపారు. సరిహద్దు రాష్ట్రాల్లో తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేస్తూ.. రాష్ట్రంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని కల్యం, పల్లెపల్లి గ్రామాల్లో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత