అనంతలో కారు ప్రమాదం... కర్ణాటక వాసి మృతి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల బోరంపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకలోని చల్లకెర నుంచి తిరుపతికి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన రైతులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కళ్యాణదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని గంగాధరగా గుర్తించారు. గాయపడ్డ రామన్న, మంజప్పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి :