అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో 2వేల 592 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన నాగేంద్ర, కేశవ్, శంకర్ ముగ్గురు కలసి కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లు తీసుకొచ్చి విక్రయించేందుకు పంచుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. 27 పెట్టెలలో ఉన్న మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేశారు. వాటి విలువ 90 వేల రూపాయలు ఉంటుందని ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
కర్నూలులో..