అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం అక్రమంగా తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 402 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 56 మద్యం పెద్దబాటిళ్లు, రూ.20 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు చిలమత్తూరు ఎస్సై తెలిపారు. మద్యం అక్రమంగా తరలిస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కర్ణాటక నుంచి తరలిస్తోన్న అక్రమ మద్యం పట్టివేత - అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం తాజా వార్తలు
అనంతపురం జిల్లా చిలమత్తూరులో అక్రమంగా మద్యం తరలిస్తోన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మద్యం, గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా