అనంతపురం జిల్లా కదిరి, గాండ్లపెంట మండలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదిరి మండలం బూరుగుపల్లిలో ఒక ఇంట్లో 120 మద్యం బాటిళ్లు గుర్తించి పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో 186 సీసాల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు - అనంతపురంలో కర్ణాటక మద్యం స్వాధీనం వార్తలు
అనంతపురం జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. కర్ణాటక నుంచి తక్కువ ధరకు కొనుగోళ్లు చేసి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నారు. కదిరి, గాండ్లపెంట మండలాల్లో నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు