ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2880 బాటిళ్ల కర్ణాటక మద్యం పట్టివేత.. నిందితుల అరెస్ట్​ - అనంతపురంలో అక్రమ మద్యం

అనంతపురం శివారులో అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిందితుల నుంచి 2880 బాటిళ్లను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor caught by police
2880 బాటిళ్ల కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Jan 10, 2021, 7:45 PM IST

అనంతపురం శివారు ప్రాంతంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్​తో పాటు.. 2880 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.

శివారు ప్రాంతమైన టీవీ టవర్ సమీపంలో కుమార్, సోము అనే వ్యక్తులు పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి రవాణా చేసి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత..

ABOUT THE AUTHOR

...view details