అనంతపురం జిల్లా పరిగి మండలంలోని కోనాపురం, గొర్రిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మడకశిర ఎస్ఈబీ అధికారుల తనిఖీల్లో ఈ మద్యం పట్టుబడింది. రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు వ్యక్తులు ఎనిమిది బాక్సులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఈబీ దాడుల్లో కర్ణాటక మద్యం పట్టివేత - Karnataka liquor seized in SEB raids news
అనంతపురం జిల్లా మడకశిర ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిగి మండలంలోని కోనాపురం, గొర్రిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాక్సులను పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఈబీ దాడుల్లో కర్ణాటక మద్యం పట్టివేత
బాక్సులను పరిశీలించగా వాటిలో.. 384 కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఉన్నాయి. మద్యం స్వాధీనం చేసుకుని, బైక్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సీఐ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ డార్కస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం: బొత్స