అనంతపురం నగరంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని.. ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని రాణినగర్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి.. అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో.. పోలీసులు దాడులు చేశారు. సురేష్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్దనున్న 102 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఒకటో పట్టణ సీఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
అక్రమంగా విక్రయిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - అనంతపురం వార్తలు
అనంతపురం జిల్లాలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని.. ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 102మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
karnataka liquot seazed