అనంతపురం జిల్లా కదిరి పట్టణం గాంధీనగర్లో అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తోన్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో భారీగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు.
1,120 టెట్రా ప్యాకెట్ల మద్యం, 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ తెలిపారు. ఈ కేసులో మరో నిందితురాలు పరారీలో ఉన్నట్లు చెప్పారు.