అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది దాడులు జరిపారు. మండలంలోని మరువపల్లి గ్రామం క్రాస్ వద్ద బీమరాజు అనే వ్యక్తి కారులో 177 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా అతన్ని అరెస్టు చేశారు. మద్యాన్ని, కారుని స్వాధీనం చేసుకున్నారు.
నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో మారెక్క అనే మహిళ వద్ద 15 కర్ణాటక మద్యం పాకెట్స్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం స్వాధీనం.. నిందితుల అరెస్ట్ - Karnataka liquor caught in the car
అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు జిల్లా నలుమూలల జల్లెడ పట్టి మద్యం అక్రమ రవాణాని అరికడుతున్నారు. తాజాగా మరువపల్లి గ్రామం క్రాస్ వద్ద కారులో తరలిస్తున్న 177 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మద్యం అమ్మటం చట్టరీత్యా నేరమని, ఇలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న అబ్కారీ శాఖ