అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో వేర్వేరు చోట్ల కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తూమకుంట గ్రామ సమీపంలో ఆటోలో 20 కేసుల కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే మండలంలోని బెస్తరపల్లి చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో 5 కేసుల బీర్లు, 20 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీగలపల్లి , ఎస్. మల్లాపురం గ్రామం వద్ద 384 ప్యాకెట్ల కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు.
కుందుర్పి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో కర్ణాటక మద్యం పట్టివేత - kundurpi mandal latest news
కుందుర్పి మండలంలోని పలు ప్రాంతాల్లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని ఎస్సై నాగన్న హెచ్చరించారు.
కుందుర్పి మండలంలో కర్ణాటక మద్యం స్వాధీనం