అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని మూడవ గ్రామ సచివాలయంలో కర్ణాటక నుంచి విచ్చేసిన అధికారుల బృందం గ్రామ సచివాలయ వ్యవస్థ పై అధ్యయనం చేశారు. కర్ణాటక పంచాయతీరాజ్ కమిషనర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి, జిల్లా పంచాయతీ అధికారి పార్వతి కర్ణాటక బృందానికి సచివాలయ పనితీరుపై అవగాహన కల్పించారు. ఉద్యోగుల విధులు, వాలంటీర్ల విధులు గురించి తెలుసుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని గుర్తించినట్లు వారు తెలిపారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను తమ ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకెళ్లి కర్ణాటకలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామసచివాలయ పనితీరుపై కర్ణాటక ఐఏఎస్ల బృందం అధ్యయనం - Karnataka IAS team visit Gram Secretariat in Somandepalli, Anantapur District
గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును అధ్యయనం చేసేందుకు అనంతపురం జిల్లా సోమందేపల్లిలోని మూడవ గ్రామ సచివాలయాన్ని కర్ణాటక ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలించింది.
గ్రామసచివాలయ పనితీరుపై కర్ణాటక ఐఏఎస్ల బృందం అధ్యయనం
ఇవీ చదవండి