ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.తన కుటుంబ సభ్యుల చిరకాల స్వప్నమైన గ్రామంలో దేవాలయాల నిర్మాణ పనుల్లో పడ్డారు. గ్రామంలో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఆయనను శుక్రనారు స్నేహపూర్వకంగా కలిసేందుకు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వత్థనారాయణ నీలకంఠాపురానికి వచ్చారు. ఈ క్రమంలో రఘువీర కుటుంబ సభ్యులు నూతనంగా చేపట్టిన దేవాలయ నిర్మాణ పనులను రఘువీరాతో కలిసి ఉపముఖ్యమంత్రి సందర్శించారు.
నీలకంఠపురంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి పర్యటన - అనంతపురంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి పర్యటన
అనంతపురం జిల్లాలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్థనారాయణ పర్యటించారు. మడకశిరలో ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరాను స్నేహపూర్వకంగా కలిసేందుకు వచ్చిన ఆయన.. ఆ కుటుంబం నిర్మిస్తున్న దేవాలయాలను సందర్శించారు.

karnataka dcm
TAGGED:
అనంతపురం జిల్లా వార్తలు